ఫిబ్రవరి నుంచే పీఎం కిసాన్ సాయం
Sakshi Education
చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం నగదు సాయాన్ని 2019, ఫిబ్రవరి నుంచే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు 2018, డిసెంబర్ నుంచే ఈ పథకం వర్తించనుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఫిబ్రవరి 3న తెలిపారు. 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందే ఈ పథకం కోసం బడ్జెట్ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పీఎం-కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) కింద ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019, ఫిబ్రవరి నుంచే పీఎం కిసాన్ సాయం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : కేంద్రప్రభుత్వం

Published date : 04 Feb 2019 06:23PM