Skip to main content

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పావుశాతం తగ్గింపు

అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది.
రెండు రోజుల పాటు జరిగి అక్టోబర్ 30న ముగిసిన సమావేశంలో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న ‘ఫెడ్ ఫండ్‌‌స రేటు’ను 1.5 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గించింది. 2019 ఏడాది రేట్లను తగ్గించడం ఫెడరల్ రిజర్వ్‌కు ఇది మూడో సారి. 2019, జూలై, సెప్టెంబర్‌ల్లో పావు శాతం మేర రేట్లను ఫెడ్ తగ్గించింది.

ఫెడరల్ ఫండ్స్ రేట్ అంటే...
బ్యాంక్‌లు పరస్పరం ఇచ్చుకునే ఓవర్‌నైట్ రుణాలపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించే రేటునే ఫెడరల్ ఫండ్‌‌స రేట్‌గా వ్యవహరిస్తారు. ఈ రేట్‌పై ఆధారపడే బ్యాంక్‌లు వినియోగదారులకు ఇచ్చే తాకట్టు, క్రెడిట్, వ్యాపార ఇలా వివిధ రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి.
Published date : 31 Oct 2019 05:34PM

Photo Stories