Pfizer-BioNTech vaccine: పూర్తి స్థాయిలో అనుమతులు పొందిన తొలి కరోనా టీకా?
Sakshi Education
ఫైజర్, బయోఎన్‌టెక్(Pfizer-BioNTech)లు సంయుక్తంగా తయారు చేసిన ఫైజర్ వ్యాక్సిన్ (బీఎన్‌టీ162బీ2(BNT162b2))కు అమెరికా ప్రభుత్వం ఆగస్టు 23న పూర్తి స్థాయి అనుమతులు జారీ చేసింది.
దీంతో పూర్తి స్థాయిలో అనుమతులు పొందిన తొలి టీకాగా ఫైజర్ నిలిచింది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో వాడుతున్న కరోనా టీకాలు కేవలం అత్యవసర అనుమతులు మాత్రమే పొందాయి. అమెరికాలో ఇప్పటికే 20 కోట్ల ఫైజర్ డోసులను ఉపయోగించారు. కామిర్నాటి(Comirnaty) అనే పేరుతో ఈ టీకాను మార్కెట్‌లోకి తెచ్చారు.
దేశంలో ఇప్పటిదాకా ఎంత శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగింది?
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. 2021, సెప్టెంబర్–అక్టోబర్ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్‌లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు ఉంటుందని నివేదిక తెలిపింది. భారత్‌లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పూర్తి స్థాయిలో అనుమతులు పొందిన తొలి కరోనా టీకా?
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ఫైజర్, బయోఎన్‌టెక్‌లు సంయుక్తంగా తయారు చేసిన ఫైజర్ వ్యాక్సిన్(బీఎన్‌టీ162బీ2(BNT162b2))
ఎక్కడ : ప్రపంచంలో...
ఎందుకు : అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చినందున...

Published date : 24 Aug 2021 06:09PM