పురుషుల మ్యాచ్‌కు తొలిసారి మహిళా అంపైర్
Sakshi Education
పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్ పొలొసక్ అరుదైన ఘనత సాధించింది.
నబీబియా రాజధాని విండ్‌హక్‌లో ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 మ్యాచ్‌కు 31 ఏళ్ల క్లైర్ అంపైర్‌గా వ్యవహరించింది. కైలర్ గత రెండున్నరేళ్లలో మహిళల క్రికెట్‌లో 15 వన్డేలకు అంపైరింగ్ చేసింది. దేశవాళీల్లోనూ పురుషుల మ్యాచ్ (2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ‘ఎ’)కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా కైలర్ ఘనతకెక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పురుషుల మ్యాచ్‌కు తొలిసారి మహిళా అంపైర్
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : క్లైర్ పొలొసక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పురుషుల మ్యాచ్‌కు తొలిసారి మహిళా అంపైర్
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : క్లైర్ పొలొసక్
ఎక్కడ : విండ్‌హక్, నమీబియా
Published date : 29 Apr 2019 05:21PM