Skip to main content

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రాజీనామా

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూప్పకూలింది. బలనిరూపణలో ముఖ్యమంత్రి వి నారాయణస్వామి విఫలమయ్యారు.
Current Affairs
బలపరీక్ష కోసం ఫిబ్రవరి 22న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌కు వెళ్లి పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌కు తన రాజీనామాను సమర్పించారు.

పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2016లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌– డీఎంకే, బీజేపీ–ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటములు బరిలోకి దిగాయి. 15 సీట్లు గెలుపొందడం ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : పుదుచ్చేరి ముఖ్యమంత్రి రాజీనామా
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : నారాయణస్వామి
ఎందుకు : బలనిరూపణలో విఫలమైనందున
Published date : 23 Feb 2021 06:00PM

Photo Stories