ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం
Sakshi Education
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో త్రివేణీ సంగమం వద్ద అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ‘అర్థ కుంభమేళా’ జనవరి 15న ప్రారంభమైంది.
మార్చి 4వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో 12 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.4,200 కోట్లను కేటాయించింది. కుంభమేళా సందర్భంగా గంగా-యమున నదీ తీరాన 32 వేల హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్‌నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు కెక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అర్థ కుంభమేళా ప్రారంభం
ఎప్పుడు : జనవరి 15
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అర్థ కుంభమేళా ప్రారంభం
ఎప్పుడు : జనవరి 15
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
Published date : 16 Jan 2019 04:28PM