పరుగులో సరికొత్త రికార్డు నెలకొల్పిన కంబళ వీరుడు?
Sakshi Education
బురద మడిలో దున్నపోతులతో పరిగెత్తే కర్ణాటక గ్రామీణ క్రీడ కంబళ పోటీల్లో ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న కర్ణాటక మంగళూరువాసి శ్రీనివాసగౌడ మరో ఘనతను సృష్టించాడు.
మంగళూరు సమీపంలోని బెళ్తంగడి తాలూకా వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువులో మార్చి 20న జరిగిన కంబళ పోటీలలో గతంలో నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని 11:21 సెకన్లలో, తర్వాత 9.37 సెకన్లలో అధిగమించినదే అత్యుత్తమ రికార్డులు కాగా, తాజా పోటీలలో ఏకంగా 8.96 సెకన్లలో చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. పాత రికార్డులను శ్రీనివాసగౌడ తుడిచిపెట్టాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరుగులో సరికొత్త రికార్డు నెలకొల్పిన కంబళ వీరుడు?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : శ్రీనివాసగౌడ
ఎక్కడ : వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువు, బెళ్తంగడి తాలూకా, మంగళూరు సమీపం
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరుగులో సరికొత్త రికార్డు నెలకొల్పిన కంబళ వీరుడు?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : శ్రీనివాసగౌడ
ఎక్కడ : వేణూరు పెర్ముడ సూర్య– చంద్ర జోడు చెరువు, బెళ్తంగడి తాలూకా, మంగళూరు సమీపం
Published date : 22 Mar 2021 05:52PM