Skip to main content

ప్రస్తుతం సీఈఆర్టీ–ఇన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు ఉన్నారు?

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై చైనా నుంచి సైబర్‌ దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ–ఇన్‌) హెచ్చరించింది.
Current Affairs
చైనాకు చెందిన ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్డీసీ)తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్‌ సిస్టంలతో ‘కమ్యూనికేట్‌’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని మార్చి 2న తెలిపింది.

నష్టమేంటి!
  • సైబర్‌ నేరగాళ్లు మన విద్యుత్‌ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థలోకి చొరబడితే... మొత్తం సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలుగుతారు. గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది.
  • గ్రిడ్‌ కుప్పకూలితే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అవుతుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుంది.

సీఈఆర్టీ
–ఇన్‌ డైరెక్టర్‌గా...
భారతదేశ సైబర్‌ భద్రత అవసరాల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2004లో ‘సీఈఆర్టీ–ఇన్‌’ను ఏర్పాటు చేసింది. సీఈఆర్టీ–ఇన్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం సీఈఆర్టీ–ఇన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా సంజయ్‌ బాహ్ల్‌ ఉన్నారు.

కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు అంటే?
హాకింగ్, సైబర్‌ దాడుల కోసం సైబర్‌ నేరస్థులు వినియోగించే కంప్యూటర్లను ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ (సీ అండ్‌ సీ) సర్వర్లు’అంటారు. ఈ సర్వర్ల నుంచి దాడులు చేయాల్సిన కంప్యూటర్లకు కమాండ్స్‌ (సాంకేతిక ఆదేశాలు) పంపించి డేటాను చోరీ చేయడం లేదా మొత్తం కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవడం చేస్తుంటారు.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై చైనా నుంచి సైబర్‌ దాడులకు ప్రయత్నాలు
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ–ఇన్‌)
ఎందుకు : విద్యుత్‌ సంస్థల సరఫరా వ్యవస్థను నియంత్రించేందుకు
Published date : 03 Mar 2021 06:10PM

Photo Stories