ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన కార్యక్రమం ప్రారంభం
Sakshi Education
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా నవంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్త ఏడో జనగణనను ప్రారంభించింది.
1990 నుంచి దశాబ్దానికోసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ క్రతువులో 70 లక్షలమంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. పదేళ్ల క్రితం జనగణన ప్రకారం చైనా జనాభా 137 కోట్లు. జనగణనలో భాగంగా పౌరుడి పేరు, ఐడీ నంబర్, లింగము, వివాహ స్థితి, విద్య, వృత్తి వివరాలు నమోదు చేసుకుంటారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏడో జనగణన ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : చైనా ప్రభుత్వం
ఎక్కడ : చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏడో జనగణన ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : చైనా ప్రభుత్వం
ఎక్కడ : చైనా
Published date : 02 Nov 2020 06:03PM