ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాంను ఎక్కడ నిర్మిస్తున్నారు?
Sakshi Education
నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం హుబ్బళ్లి ర్వేల్వే స్టేషన్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాంను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాంను 1,505 మీటర్లకు పెంచుతున్నారు. రూ.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాట్‌ఫాం నిర్మాణ, అభివృద్ధి పనులు 2021 జనవరి నాటికి పూర్తవుతాయని అంచనా. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈశాన్య రైల్వేజోన్ ప్రధాన కేంద్రమైన గోరఖ్‌పూర్‌లో ప్రపంచంలో అతి పొడవైన(1,366 మీటర్లు) ప్లాట్‌ఫాం ఉంది. హుబ్బళ్లి ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే సరికొత్త రికార్డు నమోదవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణం
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : హుబ్బళ్లి ర్వేల్వే స్టేషన్, కర్నాటక
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణం
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : హుబ్బళ్లి ర్వేల్వే స్టేషన్, కర్నాటక
Published date : 20 Nov 2020 06:10PM