ప్రపంచకప్ టోర్నీ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత ఆర్చర్?
Sakshi Education
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్ స్టేజ్–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్ షాఫ్ (అమెరికా)తో జూలై 26న జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. 2015లో పోలాండ్‌లో జరిగిన వ్రోక్లా వరల్డ్‌కప్ టోర్నీలో చివరిసారి అభిషేక్ వ్యక్తిగత స్వర్ణం సాధించాడు. 2019 ఆసియా చాంపియన్‌షిప్ తర్వాత అభిషేక్ వర్మ బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే.
మనూ–సౌరభ్ జంటకు రజతం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. క్రొయేషియాలోని ఒసిజెక్ నగరంలో జూన్ 26న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ జంటకు రజత పతకం దక్కింది. ఫైనల్లో మనూ–సౌరభ్ జోడీ 12–16తో వితాలినా బత్సారష్‌కినా–అర్తెమ్ చెర్నోసువ్ (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ టోర్నీ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత ఆర్చర్?
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : భారత ఆర్చర్ అభిషేక్ వర్మ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్

Published date : 28 Jun 2021 06:14PM