ప్రపంచకప్ ఆర్చరీలో వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన జంట
Sakshi Education
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్‌లో మహిళల, పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో భారత స్టార్ ఆర్చర్లు, భార్యాభర్తలైన దీపిక కుమారి, అతాను దాస్ స్వర్ణ పతకాలతో మెరిశారు.
గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో ఏప్రిల్ 26న జరిగిన మహిళల ఫైనల్ పోరులో దీపిక కుమారి 6–5తో మెకంజీ బ్రౌన్ (అమెరికా)పై నెగ్గి పసిడి పతకాన్ని ఖాయం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో దీపికకు ఇది మూడో ప్రపంచకప్ పసిడి పతకం కావడం విశేషం. మరోవైపు పురుషుల విభాగంలో జరిగిన ఫైనల్లో అతాను దాస్ 6–4తో డానియల్ క్యాస్ట్రో (స్పెయిన్)పై గెలుపొందాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల, పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లోవ్యక్తిగత స్వర్ణాలు సాధించిన భార్యాభర్తలు?
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : దీపిక కుమారి, అతాను దాస్
ఎక్కడ : గ్వాటెమాల సిటీ,గ్వాటెమాల
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల, పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లోవ్యక్తిగత స్వర్ణాలు సాధించిన భార్యాభర్తలు?
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : దీపిక కుమారి, అతాను దాస్
ఎక్కడ : గ్వాటెమాల సిటీ,గ్వాటెమాల
Published date : 27 Apr 2021 05:58PM