Skip to main content

ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎకనమిక్ నివేదిక విడుదల

ప్రపంచబ్యాంక్ జనవరి 9న ‘‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.
Current Affairsప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, భారత జీడీపీ వృద్ధిరేటుకి సంబంధించిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించింది.

గ్లోబల్ ఎకనమిక్ నివేదికలోని అంశాలు
  • 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. అయితే 2020-2021లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉంది.
  • 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
  • అమెరికా వృద్ధిరేటు 2020లో 1.8 శాతంగా నమోదుకావచ్చు.
  • యూరో ప్రాంతంలో 2020లో వృద్ధి ఒకశాతానికి తగ్గిస్తున్నాం. ఈ ప్రాంతంలో బలహీన పారిశ్రామిక క్రియాశీలత దీనికి ఒక కారణం.
  • 2022లో దక్షిణాసియా వృద్ధిరేటు 6 శాతంగా ఉండవచ్చు.
  • బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7 శాతంగా ఉండే వీలుంది. అయితే పాక్‌లో ఈ రేటు 3 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉండే వీలుంది.
  • వాణిజ్య యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వృద్ధితీరుకు కొంత ఇబ్బందులూ ఉన్నాయి.
  • భారత్‌ను ప్రత్యేకంగా చూస్తే, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల కఠిన రుణ పరిస్థితులు దేశీయ డిమాండ్‌ను బలహీనతకు కారణాల్లో ఒకటి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రపంచబ్యాంక్

మాదిరి ప్రశ్నలు
Published date : 10 Jan 2020 05:46PM

Photo Stories