ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు
Sakshi Education
2019 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది.
2019 ఏడాది వృద్ధి రేటును 2.6 శాతం నుంచి 1.2 శాతానికి కుదించింది. అలాగే 2020 ఏడాది వృద్ధి రేటును 3 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గించింది. ఈ మేరకు అక్టోబర్ 1న ఒక నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు వాణిజ్య వృద్ధి అంచనాలను కుదించడానికి కారణమని డబ్ల్యూటీవో తన నివేదికలో పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019 ఏడాది ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019 ఏడాది ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
Published date : 02 Oct 2019 04:47PM