Skip to main content

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో సుందర్‌కు స్వర్ణం

ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జర్ బంగారు పతకం సాధించాడు.
యూఏఈలోని దుబాయ్‌లో నవంబర్ 11న జరిగిన ఈ పోటీల్లో ఎఫ్-46 కేటగిరిలో తలపడిన సుందర్ ఈటెను 61.22 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. దీంతో టోక్యో పారాలింపిక్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. అలాగే వరుస ప్రపంచ ఈవెంట్లలో టైటిల్ నెగ్గిన రెండో రెండో పారా అథ్లెట్‌గా ఘనతకెక్కాడు. అతను లండన్ (2017) ఈవెంట్‌లోనూ బంగారం గెలిచాడు. గతంలో దేవేంద్ర జజారియా లియోన్-2013, దోహా-2015 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు.

ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అజిత్ సింగ్, రింకూలకూ టోక్యో బెర్త్‌లు లభించాయి. అజిత్ 59.46 మీటర్లతో మూడో స్థానంలో నిలువగా... రింకూకు నాలుగో స్థానం దక్కింది. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : భారత జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జర్
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
Published date : 12 Nov 2019 05:41PM

Photo Stories