Skip to main content

ప్రపంచ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు?

ప్రపంచ కార్మిక సంస్థ(ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్-ఐఎల్‌వో) పాలకమండలి అధ్యక్షుడిగా కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఎన్నికయ్యారు.
Current Affairs
2021 జూన్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత్‌కు ఐఎల్‌వో అధ్యక్ష పదవి దక్కడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2020, నవంబర్‌లో జెనీవాలో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహిస్తారు. ప్రపంచ కార్మిక సంస్థ విధానాలు, కార్యక్రమాలు, అజెండా, బడ్జెట్, డెరైక్టర్ జనరల్ ఎంపికలో పాలకమండలి కీలక పాత్ర పోషిస్తుంది. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అపూర్వచంద్ర ఇప్పటివరకు ఏడేళ్లపాటు కేంద్ర పెట్రోలియంశాఖలో పనిచేశారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య: 187

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) పాలకమండలి అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర
Published date : 24 Oct 2020 07:10PM

Photo Stories