ప్రపంచ హైజంప్‌లో మరియాకి స్వర్ణం
Sakshi Education
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల హైజంప్‌లో రష్యా అథ్లెట్ మరియా లసిట్స్‌కిని స్వర్ణ పతకం సాధించింది.
ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 30న జరిగిన మహిళల హైజంప్ ఫైనల్లో మరియా 2.04 మీ. ఎత్తు దూకి పసిడిని కైవసం చేసుకుంది. యరోస్లెవా మహుచిక్ (ఉక్రెయిన్) రజతం.. వాష్టి కున్నిగమ్ (అమెరికా) కాంస్యం అందుకున్నారు. 26 ఏళ్ల లసిట్స్‌కిని 2015, 2017 టోర్నీల్లోనూ స్వర్ణాలను గెలుచుకుంది. డోపింగ్ కారణంగా ప్రస్తుతం రష్యాపై నిషేధం ఉండడంతో ఆ దేశ అథ్లెట్లు ప్రపంచ టోర్నీలో తటస్థ అథ్లెట్లుగా పోటీపడుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల హైజంప్‌లో స్వర్ణం
ఎప్పుడు :సెప్టెంబర్ 30
ఎవరు : మరియా లసిట్స్‌కి
ఎక్కడ : దోహా, ఖతర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల హైజంప్‌లో స్వర్ణం
ఎప్పుడు :సెప్టెంబర్ 30
ఎవరు : మరియా లసిట్స్‌కి
ఎక్కడ : దోహా, ఖతర్
Published date : 02 Oct 2019 04:53PM