ప్రముఖ వ్యాపారవేత్త మీలా కన్నుమూత
Sakshi Education
ప్రముఖ వ్యాపారవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్ పీవీసీ గ్రూప్ కంపెనీ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ (88) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 25న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1971లో ఉపాధ్యాయ వృత్తిని వీడిన మీలా సత్యనారాయణ సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీని ప్రారంభించారు. సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. దేశవ్యాప్తంగా పీవీసీ పైపుల కంపెనీలను స్థాపించారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్వాతంత్య్ర సమరయోధుడు మీలా సత్యనారాయణను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక చేయగా, అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆయనకు అవార్డును అందజేశారు. పారిశ్రామిక రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అవార్డును అమెరికాలో భారత రాయబారి అబీద్ హుస్సేన్ చేతుల మీదుగా తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ వ్యాపార వేత్త కన్నుమూత
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : మీలా సత్యనారాయణ (88)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

Published date : 26 Jun 2019 05:58PM