Skip to main content

ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత కన్నుమూత

ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత చంద్రశేఖర్‌(98) కన్నుమూశారు. వయోభారంతో జూన్‌ 16న ముంబైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
Current Affairs 1923లో హైదరాబాద్‌లో జన్మించిన చంద్రశేఖర్‌ నటనపై ఉన్న మక్కువతో 1950లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్‌’ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి, ప్రేక్షకుల్ని అలరించారు. 1964లో ‘ఛ ఛ ఛ’ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వెస్ట్రన్‌ డ్యాన్స్‌ నేపథ్యంలో రూపొందిన తొలి భారతీయ చిత్రం ఇదే. రామానంద్‌ సాగర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్‌’ సీరియల్‌లో సుమంతుడి పాత్ర చేసిన చంద్రశేఖర్‌... విశేష ప్రేక్షకాదరణ పొందారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత కన్నుమూత
ఎప్పుడు : జూన్‌ 16
ఎవరు : చంద్రశేఖర్‌(98)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : వయో సంబంధిత సమస్యల కారణంగా...
Published date : 17 Jun 2021 08:56PM

Photo Stories