Skip to main content

ప్రముఖ కథా రచయిత, రేడియో ప్రయోక్త కన్నుమూత

ప్రముఖ కథా రచయిత, రేడియో ప్రయోక్త జీడిగుంట రామచంద్రమూర్తి (80) కరోనాతో పోరాడుతూ నవంబర్ 10న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు.
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 1940లో జన్మించిన ఆయన ఆకాశవాణిలో ప్రయోక్తగా, కథా రచయితగా విశేష ప్రాచుర్యం పొందారు. ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ పాత్రికేయులుగా సేవలందించారు. 250కిపైగా కథలు రాసిన రామచంద్రమూర్తి ఉత్తమ టీవీ రచయితగా రెండుసార్లు నంది పురస్కారాన్ని పొందారు. ఆయన రచించిన 30 నాటికలు దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ‘నేను నా జ్ఞాపకాలు’ పేరిట రాసిన బయోగ్రఫీకి మంచి ఆదరణ లభించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ కథా రచయిత, రేడియో ప్రయోక్త కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : జీడిగుంట రామచంద్రమూర్తి (80)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా
Published date : 11 Nov 2020 05:49PM

Photo Stories