Skip to main content

ప్రకృతిసేద్య నిపుణుడు నారాయణరెడ్డి కన్నుమూత

సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84) కర్ణాటకలోని మరలేనహళ్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 13న కన్నుమూశారు.
బెంగళూరు రూరల్ వర్తూర్‌కి చెందిన ఆయన జపాన్ ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనొబు ఫుకువోకా శిష్యుడిగా ప్రసిద్ధి పొందారు. 35 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న నారాయణరెడ్డి తన వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. మరోవైపు లీసా ఇండియా ఆంగ్ల ప్రకృతి వ్యవసాయ మాసపత్రిక కాలమిస్టుగా కూడా ఆయ‌న చాలాకాలంపాటు పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రకృతిసేద్య నిపుణుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84)
ఎక్కడ : మరలేనహళ్లి, కర్ణాటక
Published date : 16 Jan 2019 05:27PM

Photo Stories