Skip to main content

ప్రజా ప్రతినిధుల కేసులపై సుప్రీంకోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ?

ప్రజా ప్రతినిధులపై కేసుల్ని వెనక్కి తీసుకోవాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి అని భారత సుప్రీంకోర్టు వెల్లడించింది.
రాష్ట్ర హైకోర్టుల ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు... ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల్ని వెనక్కి తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని బెంచ్‌ ఆగస్టు 10న స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ, సీనియర్‌ అడ్వొకేట్‌ విజయ్‌ హన్సారియా కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అమికస్‌ క్యూరీ నివేదికపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు స్పందించింది.

ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 321 కింద సంక్రమించిన అధికారాన్ని వాడుతూ తమ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలపై కేసుల్ని వెనక్కి తీసుకున్నాయి. ప్రజా ప్రతినిధులపై 2018 డిసెంబర్‌ నాటికి పెండింగ్‌ కేసులు 4,122 ఉంటే, 2020, సెప్టెంబర్‌ నాటికి వాటి సంఖ్య 4,859కి చేరుకుందని హన్సారియా నివేదిక వెల్లడించింది.
Published date : 11 Aug 2021 06:11PM

Photo Stories