Skip to main content

పరిశుభ్రమైన ఇంధనాల వినియోగంపై నీతి ఆయోగ్‌ నివేదిక

భారత్‌లో సరుకు రవాణా వేగవంతం చేయడంలో పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం అంశంపై రాకీ మౌంటెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఎంఐ)తో కలిసి నీతి ఆయోగ్‌ ఒక నివేదిక రూపొందించింది.
Current Affairs
ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో సరుకు రవాణాకు కూడా డిమాండ్‌ గణనీయంగా పెరగగలదని ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక జూన్ 9న విడుదలైంది.

నివేదికలోని ముఖ్యాంశాలు...
 
  • సరుకు రవాణాకోసం పరిశుభ్రమైన, వ్యయాలను తగ్గించగలిగే ఇంధనాలను వినియోగించడం వల్ల భారత్‌.. 2020–2050 మధ్య కాలంలో లాజిస్టిక్స్‌ ఇంధనంపరంగా రూ. 311 లక్షల కోట్లు ఆదా చేసుకోగలదు.
  • వచ్చే మూడు దశాబ్దాల్లో 10 గిగాటన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.
  • రైల్వే నెట్‌వర్క్‌ను పెంచుకోవడం, వేర్‌హౌసింగ్‌ను మెరుగుపర్చుకోవడం, విధానపరమైన సంస్కరణలు తీసుకోవడం, పరిశుభ్రమైన టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పైలట్‌ ప్రాజెక్టులు నిర్వహించడం, ఇంధన ఆదా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • వృద్ధి బాటలో ఉన్న భారత ఎకానమీకి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం సరుకు రవాణా కీలకంగా మారిందని, రవాణా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
Published date : 10 Jun 2021 06:49PM

Photo Stories