ప్రధాని మోదీ ఫొటోను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న శాటిలైట్ పేరు?
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2021, ఫిబ్రవరి 28న పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్రయోగం నిర్వహించనుంది.
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వాహకనౌకను నింగిలోకి పంపనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇస్రో... భారత ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుండటం ఇదే తొలిసారి.
21 శాటిలైట్లలో....
ఇస్రో నింగిలోకి పంపనున్న 21 శాటిలైట్లలో... ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్, సతీశ్ ధావన్(ఎస్‌డీ శాట్)ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్‌జ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్ (శ్రీపెరంబుదూర్), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్(నాగ్‌పుర్), శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు.
సతీష్‌ధావన్ శాటిలైట్‌లో...
సతీష్‌ధావన్ శాటిలైట్‌లో మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’ పదాలు, భగవద్గీత పుస్తకం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను అంతరిక్షంలో పంపనున్నారు. ఈ విషయాన్ని స్పేస్ కిడ్‌జ సీఈవో డాక్టర్ శ్రీమతి కేసన్ తెలిపారు. ఈ 25 వేల పేర్లలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్రయోగం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : శ్రీహరికోట, సూళ్లూరు పేట మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : 21 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు

Published date : 16 Feb 2021 05:44PM