ప్రభుత్వ ప్రాజెక్టుగా ముంబై-పుణే హైపర్‌లూప్
Sakshi Education
ముంబై-పుణె మధ్య నిర్మించనున్న హైపర్‌లూప్‌ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 1న ఆమోదం తెలిపింది.
దీంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగాలభించనున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి పుణెలోకి వాకాడ్ వరకు నిర్మించే ఈ హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే, ముంబై-పుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్‌లూప్‌ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్‌లూప్‌ను నిర్మిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ ప్రాజెక్టుగా ముంబై-పుణే హైపర్‌లూప్
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : మహారాష్ట్ర మంత్రివర్గం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ ప్రాజెక్టుగా ముంబై-పుణే హైపర్‌లూప్
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : మహారాష్ట్ర మంత్రివర్గం
Published date : 02 Aug 2019 05:22PM