ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద పోర్ట్ కేపీసీఎల్‌ను కొనుగోలు చేసిన సంస్థ?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ (కేపీసీఎల్)ను అదానీ పో ర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) కొనుగోలు చేసింది.
రూ. 12,000 కోట్ల వేల్యుయేషన్‌తో కేపీసీఎల్ కొనుగోలు ప్రక్రియ పూర్తయి్యందని అక్టోబర్ 5న ఏపీఎస్‌ఈజెడ్ తెలిపింది. దీనితో సీవీఆర్ గ్రూప్ సహా ఇతర ఇన్వెస్టర్ల నుంచి నియంత్రణ హక్కులతో 75 శాతం వాటాలు ఏపీఎస్‌ఈజెడ్‌కు లభించినట్లవుతుందని పేర్కొంది. ‘దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద పోర్ట్ అయిన కేపీసీఎల్ ఇప్పుడు ఏపీఎస్‌ఈజెడ్‌లో భాగం కావడం మాకు సంతోషకరమైన అంశం.‘ అని ఏపీఎస్‌ఈజెడ్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ (కేపీసీఎల్)ను కొనుగోలు చేసిన సంస్థ
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్)
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ (కేపీసీఎల్)ను కొనుగోలు చేసిన సంస్థ
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్)
Published date : 08 Oct 2020 12:27PM