ప్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
Sakshi Education
ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారని భారత ప్రధానమంత్రి కార్యాలయం జనవరి 10న తెలిపింది.
ఈ ఫోన్ కాల్‌లో పలు ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించింది. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడేలా చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పినట్లు పేర్కొంది. రక్షణ రంగం, పౌర అణుశక్తి, మెరైన్ భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెంచుకునేందుకు వారు అంగీకరించినట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ఫోన్‌లో సంభాషణ
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ఫోన్‌లో సంభాషణ
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు
మాదిరి ప్రశ్నలు
1. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1. మార్చి 15
2. జనవరి 11
3. జనవరి 10
4. ఏప్రిల్ 11
- View Answer
- సమాధానం: 1
2. ఎనిమిది అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-8లో సభ్యత్వంలో లేని దేశాన్ని గుర్తించండి?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. ఆస్ట్రియా
4. కెనడా
- View Answer
- సమాధానం: 3
Published date : 11 Jan 2020 06:53PM