పోటీ క్రీడగా యోగాను గుర్తించిన దేశం?
Sakshi Education
భారత్‌లో ప్రాచీన చరిత్ర ఉన్న యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు డిసెంబర్ 17న తెలిపారు. 2021 ఫిబ్రవరిలో ‘జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీల’ను పైలట్ చాంపియన్‌షిప్‌గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయక, ఆర్టిస్టిక్, రిథమిక్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్, టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ)కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోటీ క్రీడగా యోగాను గుర్తించిన దేశం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోటీ క్రీడగా యోగాను గుర్తించిన దేశం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత్
Published date : 18 Dec 2020 06:48PM