Skip to main content

పోలవరం అంచనా వ్యయం 55,548 కోట్లు

పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా కేంద్రం నిర్ధారించిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారు.
రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కటారియా జూన్ 24న ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

సభలో మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. 2018, జనవరిలో ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను 2013-14, 2017-18 ధరల సూచీకి అనుగుణంగా వరుసగా రూ.57,941 కోట్లు, రూ.57,297.42 కోట్ల మేర కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించింది. జలవనరుల శాఖలోని సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల విభాగం సలహా కమిటీ.. ఫిబ్రవరి 11న జరిగిన భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. 2017-18 ధరల ప్రాతిపదికన సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పోలవరం అంచనా వ్యయం 55,548 కోట్లు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా
Published date : 25 Jun 2019 06:06PM

Photo Stories