Skip to main content

పంజాబ్ మెయిల్‌కు 107 ఏళ్లు పూర్తి

మన దేశంలోనే అత్యంత దూరం నడిచే పాత రైలు బండి పంజాబ్ మొయిల్ జూన్ 1తో 107 ఏళ్లను పూర్తి చేసుకుంది.
ఆవిరితో నడిచే ఈ రైలును 1912 జూన్ 1న ప్రారంభించారు. బ్రిటిషు ఇండియాలో ముంబై నుంచి పెషావర్ (ప్రస్తుతం పాక్‌లో ఉంది) వరకు ఈ రైలు నడిచింది. బ్రిటీష్ ఇండియాలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందిన పంజాబ్ మెయిల్ ప్రస్తుతం విద్యుత్‌తోనే నడుస్తుంది. ప్రస్తుతం ఈ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వరకు నడుస్తోంది.

అదేవిధంగా ముంబై నుంచి పుణెకు నడిచే డెక్కన్ క్వీన్ 89 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1930జనవరి 1న ప్రారంభమైన ఈ రైలు దేశంలో తొలి డీలక్స్ రైలుగా పేరొందింది.
Published date : 03 Jun 2019 05:52PM

Photo Stories