పల్స్ పోలియో-2021
Sakshi Education
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 30న రాష్ట్రపతి భవన్‌లో పల్స్‌పోలియో-2021ను ప్రారంభించారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే-2021 సందర్భంగా జనవరి 31న దేశవ్యాప్తంగా ఉన్న 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
పోలియో నిర్మూలనలో భాగంగా ‘జాతీయ పోలియో నిరోధక దినోత్సవాన్ని’ (నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే) పాటిస్తున్నారు. 2021 పోలియో నిరోధక దినోత్సవాన్ని దేశంలో జనవరి 31న పాటిస్తున్నారు. 2021 సంవత్సరం సుమారు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. భారత్‌ను పోలియోరహిత దేశంగా 2014లో మార్చి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
అన్సారీ పుస్తకం...
భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి ‘‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్’’ పేరుతో రాసిన పుస్తకం విడుదలైంది. రాజ్యసభ చైర్మన్‌గా తన అనుభవాలు, మరికొన్ని అంశాలను గురించి ఈ పుస్తకంలో అన్సారీ వివరించారు.అన్సారీ పుస్తకం...
Published date : 03 Feb 2021 05:33PM