పక్షుల సంరక్షణపై ఏపీ అటవీ శాఖ ఒప్పందం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని వలస పక్షుల ఆవాస కేంద్రాల అభివృద్ధి, అంతరించిపోతున్న మత్స్యజాతుల జాబితాల్లోని వేల్‌షార్క్ సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇటీవల జరిగిన ‘కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేరీ స్పీసెస్- 13వ సదస్సు (సీఎంఎస్-కాప్ 13)’లో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్), వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ)లతో ఈ ఒప్పందాలను చేసుకుంది. అటవీ శాఖ తరఫున రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ విభాగం పీసీసీఎఫ్ డి.నళిన్ మోహన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వలస పక్షుల ఆవాస కేంద్రాలను గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం కోసం బీఎన్‌హెచ్‌ఎస్‌తో, రాష్ట్రంలోని తీర ప్రాంతం పొడవునా వేల్ షార్క్‌ల సంరక్షణ కోసం డబ్ల్యూటీఐతో అటవీ శాఖ ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పక్షుల సంరక్షణపై బీఎన్‌హెచ్‌ఎస్‌తో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ
ఎందుకు : వలస పక్షుల ఆవాస కేంద్రాలను గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం కోసం

Published date : 24 Feb 2020 06:07PM