పీట్ సంప్రాస్ రికార్డు సమం చేసిన సెర్బియా టెన్నిస్ స్టార్?
Sakshi Education
అత్యధికసార్లు పురుషుల టెన్నిస్ సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ పీట్ సంప్రాస్(అమెరికా) పేరిట ఉన్న రికార్డును సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ సమం చేశాడు.
గతంలో సంప్రాస్ 1993 నుంచి 1998 వరకు వరుసగా ఆరేళ్లపాటు సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌గా ముగించాడు. 33 ఏళ్ల జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్‌లను టాప్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ సరసన చేరాడు.
మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే...
కరోనా వైరస్ కారణంగా కుదించిన 2020 ఏడాది టెన్నిస్ సీజన్‌లో జొకోవిచ్ మొత్తం 39 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అంతేకాకుండా నాలుగు టైటిల్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించినందుకు అతనికి అధికారిక ట్రోఫీని ప్రదానం చేస్తారు.

Published date : 09 Nov 2020 05:55PM