పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతం
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 11న ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
పీఎస్‌ఎల్‌వీ సీ-48 రాకెట్ ద్వారా రీశాట్- 2బీఆర్1 శాటిలైట్‌తోపాటు అమెరికాకు చెందిన మరో 6 ఉపగ్రహాలు, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను 21.19 నిమిషాల్లో భూమికి 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ఇస్రో ప్రవేశపెట్టింది.
రీ శాట్ ప్రత్యేకతలు
పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 50వ ప్రయోగం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ) సిరీస్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-48 50వ ప్రయోగం. అలాగే శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 75వ ప్రయోగం.
క్విక్ రివ్యూ :
ఏమిటి :పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రీశాట్- 2బీఆర్1 శాటిలైట్‌తోపాటు మరో 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు
రీ శాట్ ప్రత్యేకతలు
- దేశీయ అవసరాలకు అవసరమైన అన్ని పరిశోధనలు చేసేందుకు రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలు (రీ శాట్) దోహదపడుతున్నాయి.
- సరిహద్దులో జరిగే చొరబాట్లను పసిగడుతుంది.
- ఇప్పటికే రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో తాజాగా మూడో ఉపగ్రహమైన 628 కిలోల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని రక్షణ రంగ అమ్ముల పొదిలో చేర్చింది.
- 2012 ఏప్రిల్ 26న పీఎస్‌ఎల్‌వీ సీ-19 రాకెట్ ద్వారా రీశాట్-2 ఉపగ్రహాన్ని పంపించగా.. దీని కాలపరిమితి అయిపోవడంతో 2019, మే 22న పీఎస్‌ఎల్‌వీ సీ-46 రాకెట్ ద్వారా రీశాట్-2బీ ఉపగ్రహాన్ని పంపించారు.
- ఈ ఉపగ్రహాల్లో అమర్చిన పేలోడ్స్ భూమి మీద 20 నుంచి 30 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే ఏ వస్తువునైనా ఫొటోలు తీసేవి. తాజా ఉపగ్రహంలో అమర్చిన ఎక్స్‌బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ భూమి మీద జరిగే మార్పులను పసిగడుతుంది.
- భూమి మీద 10 సెంటీ మీటర్ల వ్యాసార్థంలో ఉండే ఎలాంటి చిన్న వస్తువునైనా సరే రాత్రి, పగలు అనే తేడా లేకుండా అత్యంత నాణ్యమైన చిత్రాలు తీసి పంపించే సామర్థ్యం కలిగి ఉంది.
- దేశ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, పంటల విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ అత్యంత నాణ్యమైన ఫొటోలు తీసి పంపిస్తుంది.
- ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ భూమికి 576 కి.మీ. ఎత్తునుంచి దేశానికి ఒక సరిహద్దు సెక్యూరిటీగా పనిచేస్తుంది. ఇది ఐదేళ్ల పాటు రోదసీలో ఉండి పనిచేస్తుంది.
పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 50వ ప్రయోగం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ) సిరీస్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-48 50వ ప్రయోగం. అలాగే శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 75వ ప్రయోగం.
క్విక్ రివ్యూ :
ఏమిటి :పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రీశాట్- 2బీఆర్1 శాటిలైట్‌తోపాటు మరో 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు
Published date : 12 Dec 2019 06:27PM