Skip to main content

పేటెంట్లపై భారత్, జపాన్ ఒప్పందం

పేటెంట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసే విధంగా భారత్, జపాన్ పేటెంట్ కార్యాలయాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Current Affairsప్రయోగాత్మకంగా పరీక్షించే ఈ ఒప్పందం 3 ఏళ్లు అమల్లో ఉంటుంది. ద్వైపాక్షిక పేటెంట్ ప్రాసిక్యూషన్ హైవే (పీపీహెచ్) ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కుదిరిన తొలి ఒప్పందం ఇదేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నవంబర్ 21న తెలిపింది. మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా కంపెనీలు మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు, కొంగొత్త టెక్నాలజీల ఆవిష్కరణకు, ఉపాధి అవకాశాలకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని వివరించింది.

2014-15లో పేటెంట్ దరఖాస్తు పరిశీలనా వ్యవధి 72 నెలలుగా ఉండగా.. దాన్ని ప్రస్తుతం 36 నెలలకు కుదించారు. 2021 నాటికి దీన్ని 12-16 నెలలకు కుదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వేగవంతమైన విధానం కింద 67 రోజుల్లోనే అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. 2014-15లో 6,000 పేటెంట్లు జారీ కాగా.. 2018-19 నాటికి ఇది 15,000కు చేరింది. ఈ ఏడాది ఇది 25,000కు చేరవచ్చని అంచనా.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: పేటెంట్లపై భారత్, జపాన్ ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 21
ఎందుకు
: పేటెంట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు
Published date : 22 Nov 2019 06:05PM

Photo Stories