పాకిస్తాన్ రాద్-2 క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
పాకిస్తాన్ ఫిబ్రవరి 18న నిర్వహించిన ‘రాద్-2(Ra’ad-II) క్రూయిజ్ క్షిపణి’ పరీక్ష విజయవంతమైంది.
అణుసామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్-2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించారు. ఈ క్షిపణి భూమిపై, సముద్రంలో పాక్ సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచింది. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించేందుకు రాద్-2 ఆయుధ వ్యవస్థకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను అనుసంధానించారని పాక్ మిలటరీ తెలిపింది. పాక్ అభివృద్ధి చేసిన రాద్-2ని.. భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి దీటుగా రూపొందించేందుకు ప్రయత్నించిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘రాద్-2(Ra’ad-II) క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : పాకిస్తాన్
ఎక్కడ : పాకిస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘రాద్-2(Ra’ad-II) క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : పాకిస్తాన్
ఎక్కడ : పాకిస్తాన్
Published date : 19 Feb 2020 06:01PM