పాకిస్తాన్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
Sakshi Education
పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న పాకిస్తాన్ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ బొమ్మను ప్రదర్శించారు.
వర్ధమాన్ చుట్టూ పాక్ సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును ఉంచారు. 2019, ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది.
Published date : 11 Nov 2019 06:00PM