పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై నిషేధం
Sakshi Education
పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది.
పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు ఏప్రిల్ 27న శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2020, ఫిబ్రవరిలో ఉమర్ అక్మల్ రెండు అనుచిత, అసందర్భ ఘటనలకు బాధ్యుడయినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్‌కు తమ్ముడైన 29 ఏళ్ల ఉమర్ అక్మల్ అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లు ఆడాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)
ఎందుకు : బోర్డు నియమావళిని అతిక్రమించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)
ఎందుకు : బోర్డు నియమావళిని అతిక్రమించినందుకు
Published date : 28 Apr 2020 06:58PM