Skip to main content

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణ శిక్ష రద్దు

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది.
Current Affairsప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి 13న లాహోర్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది.

2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముషారఫ్ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి 2019, డిసెంబర్‌లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్‌ల త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష రద్దు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : లాహోర్ హైకోర్టు
ఎందుకు : ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగ విరుద్ధం అని

మాదిరి ప్రశ్నలు
Published date : 14 Jan 2020 04:10PM

Photo Stories