Skip to main content

ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్లు అర్హత

2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత పురుషుల, మహిళల హాకీ జట్లు అర్హత సాధించాయి.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నవంబర్ 2న జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో అమెరికాపై 1-5తో నెగ్గిన భారత మహిళల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం 1-4తో ఓటమి పాలయ్యింది. భారత్, అమెరికా చెరో మ్యాచ్‌లో నెగ్గడంతో... నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల్లో సాధించిన మొత్తం గోల్స్ ఆధారంగా బెర్త్ ఎవరికి దక్కాలో నిర్ణయించారు. ఇక్కడ భారత్ 6-5 గోల్స్ తేడాతో అమెరికాపై పైచేయి సాధించి ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడం ఇది మూడోసారి (1980, 2016) మాత్రమే.

మరోవైపు తొలి అంచె మ్యాచ్‌లో రష్యాపై 4-2తో నెగ్గిన భారత పురుషుల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా 7-1 గోల్స్ తేడాతో రష్యాను చిత్తు చేసి ‘టోక్యో’ బెర్త్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం గోల్స్‌లోనూ భారత్‌దే 11-3తో పైచేయిగా నిలిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : భారత పురుషుల, మహిళల హాకీ జటు
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
Published date : 04 Nov 2019 05:37PM

Photo Stories