Skip to main content

ఒలింపిక్స్ ఫ్లాగ్ బేరర్లుగా ఒక్కో దేశం నుంచి ఇద్దరు

టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త సాంప్రదాయానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తెర తీస్తోంది.
Current Affairsమెగా ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పతాకధారులుగా (ఫ్లాగ్ బేరర్లు) ఇకపై ఒక దేశం నుంచి ఇద్దరిని అనుమతిస్తున్నట్లు మార్చి 5న ఐఓసీ ప్రకటించింది. ఒక పురుష అథ్లెట్, ఒక మహిళా అథ్లెట్‌ను ఆయా దేశాలు తమ ఫ్లాగ్ బేరర్లుగా నామినేట్ చేయవచ్చని వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్‌తో పోలిస్తే 2020 ఒలింపిక్స్‌లో మహిళా సమానత్వానికి అమిత ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో పాల్గొనే అథ్లెట్లలో 48.8 శాతం మహిళలే ఉన్నారని ఐఓసీ పేర్కొంది. జపాన్ రాజధాని టోక్యోలో 2020, జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్-2020 జరగనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫ్లాగ్ బేరర్లుగా ఒక్కో దేశం నుంచి ఇద్దరు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
ఎక్కడ : ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
Published date : 06 Mar 2020 05:49PM

Photo Stories