Skip to main content

ఓఐసీ సదస్సుకు సుష్మా స్వరాజ్

అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) రెండు రోజుల సదస్సుకు భారత్ తరఫున విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మార్చి 1న హాజరయ్యారు.
దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న తొలి భారత మంత్రిగా సుష్మా గుర్తింపు పొందారు. యూఏఈ రాజధాని అబుదాబిలో జరిగిన ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతూ.. దేశాలను అస్థిర పరుస్తోన్న ఉగ్రవాదంపైనే తమ యుద్ధం తప్ప మతాలకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. ఓఐసీ సదస్సుకు భారత్ ముఖ్య అతిథిగా హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ఈ సదస్సులో పాల్గొనలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్
ఎక్కడ : అబుదాబి, యూఏఈ
Published date : 02 Mar 2019 05:26PM

Photo Stories