New Covid Variant: దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ పేరు?
Sakshi Education
కొవిడ్–19 కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో గుర్తించామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌ఐసీడీ–దక్షిణాఫ్రికా) సైంటిస్టులు ఆగస్టు 30న తెలిపారు.
దక్షిణాఫ్రికాకు చెందిన కేఆర్‌ఐఎస్‌పీ సంస్థతో కలిసి జరిపిన పరిశోధనలో కరోనా కొత్త వేరియంట్ ‘‘సీ.1.2’’ బయటపడిందని వెల్లడించారు. మేలోనే ఈ వేరియంట్‌ను గుర్తించామని, ఆగస్టు నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లో దీని జాడలు కనిపించాయని హెచ్చరించారు. ఈ వైరస్ కరోనా టీకాలు కల్పించే రక్షణను దాటుకొని సోకుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్‌లో అధిక ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఉన్నాయని వెల్లడించారు. కొత్తగా కనుగొన్న వేరియంట్‌లో మ్యుటేషన్ రేటు సంవత్సరానికి 41.8 శాతమని, ఇతర వేరియంట్ల మ్యుటేషన్‌రేటు కన్నా ఇది దాదాపు రెట్టింపని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా కొత్త వేరియంట్ ‘‘సీ.1.2’’ బయటపడిందని వెల్లడి
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌ఐసీడీ–దక్షిణాఫ్రికా) సైంటిస్టులు
ఎక్కడ : దక్షిణాఫ్రికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా కొత్త వేరియంట్ ‘‘సీ.1.2’’ బయటపడిందని వెల్లడి
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌ఐసీడీ–దక్షిణాఫ్రికా) సైంటిస్టులు
ఎక్కడ : దక్షిణాఫ్రికా
Published date : 31 Aug 2021 06:11PM