Skip to main content

న్యూఢిల్లీలో యూఎన్‌సీసీడీ సదస్సు

దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు యునెటైడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసెర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ) సదస్సు జరగనుంది.
ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 14 ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆగస్టు 27న తెలిపారు.

సదస్సు సందర్భంగా మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం..
  • సుమారు 200 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు, 100 మంది మంత్రులు పాల్గొననున్న ఈ సదస్సులో భూ ఎడారీకరణను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
  • దేశవ్యాప్తంగా 2030 నాటికి సుమారు 50 లక్షల హెక్టార్ల బీడు భూములను తిరిగి సారవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • దేశంలోని భూమిలో సుమారు 29 శాతం బీడుబారిపోయింది.
  • డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సెప్టెంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు యూఎన్‌సీసీడీ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : న్యఢిల్లీ
ఎందుకు : భూ ఎడారీకరణను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు
Published date : 28 Aug 2019 05:49PM

Photo Stories