నవరత్నాల అమలుకు ప్రత్యేక కమిటీలు
Sakshi Education
ప్రతిష్టాత్మక నవరత్నాల పథకాలను అర్హులైన వారికి మరింత సమర్థంగా అందించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర స్థాయి కమిటీ
రాష్ట్రస్థాయి కమిటీలో 27 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షునిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.శామ్యూల్, సభ్య కన్వీనర్‌గా ప్రణాళికా శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఉంటారు.
జిల్లా స్థాయి కమిటీ
జిల్లా స్థాయి కమిటీకి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా మంత్రులు, నవరత్నాలకు సంబంధించిన శాఖల జిల్లాల అధికారులు ఉంటారు. ఈ కమిటీకి సభ్య కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నవరత్నాల అమలుకు ప్రత్యేక కమిటీలు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : నవరత్నాల పథకాలను అర్హులైన వారికి మరింత సమర్థంగా అందించేందుకు

Published date : 29 Nov 2019 05:39PM