నవంబర్‌లో గిల్గిత్ అసెంబ్లీ ఎన్నికలు: పాకిస్తాన్
Sakshi Education
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిత్- బాల్టిస్తాన్ అసెంబ్లీకి 2020, నవంబర్ 15వ తేదీన ఎన్నికలు జరపనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్ - బాల్టిస్తాన్ శాసన సభకు నవంబర్ 15న ఎన్నికలు జరుగుతాయని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న గిల్గిత్- బాల్టిస్తాన్ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతోపాటు గిల్గిత్-బాల్టిస్తాన్ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గిల్గిత్- బాల్టిస్తాన్ అసెంబ్లీకి 2020, నవంబర్ 15వ తేదీన ఎన్నికలు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : గిల్గిత్- బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)
క్విక్ రివ్యూ :
ఏమిటి : గిల్గిత్- బాల్టిస్తాన్ అసెంబ్లీకి 2020, నవంబర్ 15వ తేదీన ఎన్నికలు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : గిల్గిత్- బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)
Published date : 25 Sep 2020 05:25PM