Skip to main content

నూతన విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రం?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్ చట్టం-2003 సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ సెప్టెంబర్ 15న తీర్మానం చేసింది.
Current Affairs

ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉందని, రైతులు, పేదల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ బిల్లు రూపకల్పన జరిగిందని పేర్కొంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

బీపాస్ బిల్లుకు మండలి ఆమోదం
దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే భవన నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు ఉద్దేశించిన ‘టీఎస్ బీపాస్ బిల్లు’ను తెలంగాణ శాసన మండలి ఆమోదించింది. టీఎస్ బీపాస్ ఇళ్లు కట్టుకునే పేదలకు బ్రహ్మాస్త్రంగా పనికొస్తుందని, ఇళ్ల నిర్మాణంలో దశాబ్దాలుగా కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల వేధింపులకు గురై కష్టాలు పడిన వారికి ఈ బిల్లుతో విముక్తి లభిస్తుందని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

చదవండి: టీఎస్ బీ-పాస్ బిల్లులోని ముఖ్యాంశాలు

క్విక్ రివ్యూ :
ఏమిటి : నూతన విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : తెలంగాణ
ఎందుకు : సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని

Published date : 16 Sep 2020 05:16PM

Photo Stories