Skip to main content

నటన శిక్షకుడు దేవదాస్ కనకాల ఇకలేరు

సీనియర్ నటుడు, నటన శిక్షకుడు దేవదాస్ కనకాల (75) ఇకలేరు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆగస్టు 2న కన్నుమూశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారులోని కనకాలపేటలో 1945 జూలై 30న కనకాల పాపయ్య నాయుడు, మహాలక్ష్మమ్మ దంపతులకు దేవదాస్ జన్మించారు. దేవదాస్ తండ్రి పాపయ్య.. ఫ్రెంచి పాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు.

నటుడిగా, శిక్షకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దేవదాస్ కనకాల చలిచీమలు, నాగమల్లి సినిమాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్ లీడర్, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుచేసి నటనలో శిక్షణనిచ్చారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, భానుచందర్, రఘువరన్, నాజర్, తదితర ప్రముఖులు దేవదాస్ శిష్యులే. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీనియర్ నటుడు, నటన శిక్షకుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : దేవదాస్ కనకాల (75)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 03 Aug 2019 05:31PM

Photo Stories