నోకియా సీఈఓగా రాజీవ్ సూరి రాజీనామా
Sakshi Education
ఫిన్లాండ్‌కి చెందిన దిగ్గజ కంపెనీ నోకియా అధ్యక్షుడు, సీఈఓ రాజీవ్ సూరి తన పదవికి రాజీనామా చేశారు.
రాజీవ్ సూరి వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు మార్చి 2న కంపెనీ తెలిపింది. కంపెనీ నూతన అధ్యక్షుడు, సీఈవోగా పెక్కా లుండ్‌మార్క్‌ను నోకియా డెరైక్టర్ల బోర్డు నియమించింది. 2020, సెప్టెంబర్ నుంచి పెక్కా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి గత 25 ఏళ్లుగా నోకియాలో పనిచేశారు. నోకియా అధ్యక్షుడు, సీఈఓగా 2020, ఆగస్టు 31 వరకు సూరి కొనసాగుతారు. ఇక 2021 జనవరి 1 వరకు నోకియా బోర్డులో సలహాదారుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నోకియా అధ్యక్షుడు, సీఈఓ రాజీనామా
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : రాజీవ్ సూరి
క్విక్ రివ్యూ :
ఏమిటి : నోకియా అధ్యక్షుడు, సీఈఓ రాజీనామా
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : రాజీవ్ సూరి
Published date : 03 Mar 2020 06:08PM