నో బ్యాగ్ డే వీడియోకు జాతీయ అవార్డు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన వీడియో ప్రోగ్రాముకు జాతీయ అవార్డు లభించింది.
జాతీయ స్థాయిలో జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) నిర్వహించిన అత్యుత్తమ ఆడియో, వీడియో ప్రోగ్రాములలో ‘నో బ్యాగ్ డే’ వీడియోకు ప్రథమ స్థానం లభించింది. కేరళలోని కొచ్చిలో ఎన్‌సీఈఆర్టీ ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు ‘24వ ఆల్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఆడియో వీడియో ఫెస్టివల్, ఐసీటీ మేళా-2020’ను నిర్వహించింది. ఫిబ్రవరి 24న ఎన్‌సీఈఆర్‌టీ జాయింట్ డెరైక్టర్ అమరేంద్ర బెహర్ చేతుల మీదుగా ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌సీఈఆర్టీ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ఎస్సీఈఆరీ నో బ్యాగ్ డే కార్యక్రమం
ఎక్కడ : కొచ్చి, కేరళ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌సీఈఆర్టీ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ఎస్సీఈఆరీ నో బ్యాగ్ డే కార్యక్రమం
ఎక్కడ : కొచ్చి, కేరళ
Published date : 26 Feb 2020 05:57PM